మధ్యాహ్న భోజనానికి పురుగుల బియ్యం | worst rice for mid day meals | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనానికి పురుగుల బియ్యం

Jan 3 2017 2:31 AM | Updated on Sep 5 2017 12:12 AM

మధ్యాహ్న భోజన పథకం కోసం కె.గోకవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు పంపిన బియ్యంలో పురుగులు, రాళ్లు అధికంగా ఉండడంతో సోమవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

లింగపాలెం : మధ్యాహ్న భోజన పథకం కోసం కె.గోకవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు పంపిన బియ్యంలో పురుగులు, రాళ్లు అధికంగా ఉండడంతో సోమవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని పురుగులు, రాళ్లు ఉన్న బియ్యంతో వండిన అన్నాన్ని ఎలా తినాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సోమశేఖరరావు హైస్కూల్‌కు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. వంట ఏజన్సీ నిర్వాహకులు పురుగులబియ్యాన్ని ఆయనకు చూపించారు. ఇలాంటి బియ్యాన్ని తింటే తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌  వెంటనే బియ్యాన్ని మార్పిస్తానని తెలిపారు. వెంటనే పౌరసరఫరాల గోదాం అధికారికి ఫో¯ŒS చేసి గోకవరం హైస్కూల్‌కు మంచి బియ్యాన్ని అందించాలని ఆదేశించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement