రాజధానికి ఉద్యోగులు, అధికారుల తరలింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
హైదరాబాద్: రాజధానికి ఉద్యోగులు, అధికారుల తరలింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఉద్యోగులను ఒకే సారి తరలించాలా లేదా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఉద్యోగులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కొత్త రాజధాని ప్రాంతానికి ఒకే సారి ఉద్యోగులను అధికారులను తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలు సీఎస్తో భేటీ అయిన విషయం తెలిసిందే. తమను తరలించే విషయంలో వారు ఇప్పటికే పలు భిన్నాభిప్రాయాలు తెలిపినందున పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపనున్నట్లు సీఎస్ పరోక్షంగా తెలిపారు.