అవినీతిపై అందరూ పోరాడాలి | walkdan rally | Sakshi
Sakshi News home page

అవినీతిపై అందరూ పోరాడాలి

Nov 5 2016 11:09 PM | Updated on Sep 27 2018 4:34 PM

అవినీతిపై అందరూ పోరాడాలి - Sakshi

అవినీతిపై అందరూ పోరాడాలి

అవినీతికి వ్యతిరేకంగా బందరురోడ్డులో శనివారం కస్టమ్స్, ఇన్‌కంటాక్స్‌ ఉద్యోగులు ‘వాక్‌దన్‌’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా కస్టమ్స్, ఇన్‌కంటాక్స్‌ ఉద్యోగులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ అజిత్‌కుమార్‌ శ్రీవాత్సవ ప్రారంభించారు.

విజయవాడ : అవినీతికి వ్యతిరేకంగా బందరురోడ్డులో శనివారం కస్టమ్స్, ఇన్‌కంటాక్స్‌ ఉద్యోగులు ‘వాక్‌దన్‌’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా కస్టమ్స్, ఇన్‌కంటాక్స్‌ ఉద్యోగులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ అజిత్‌కుమార్‌ శ్రీవాత్సవ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవినీతిపై ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎస్‌పీ చౌదరి మాట్లాడుతూ అవినీతి వల్ల అభివృద్ధి కుంటుపడుతుంన్నారు. ఏపీ కస్టమ్స్‌ కమిషనర్‌ ఎస్‌కే రెహమాన్‌ మాట్లాడుతూ ధర్మమార్గం క్షేమకరం, శుభకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌కంటాక్స్‌ ఉన్నతాధికారులు ఏకే శ్రీవాత్సవ, ఎస్‌పీ చౌదరి, సుశీల్‌ కుమార్‌ జాజూ, కస్టమ్స్‌ కమిషనర్‌ ఎస్‌కే రెహమాన్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చంద్రశేఖర్, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ హరకుమార్‌కు నిర్వాహక కమిటీ ప్రతినిధులు జ్ఞాపికలు అందజేశారు. ఇన్‌కంటాక్స్‌ అడిషినల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్, జాయింట్‌ కమిషనర్లు టీవీపీ లత, శేషశ్రీనివాస్, సత్యానందం, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement