శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం | viralaam to srivari nityannadanam trust | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

Aug 25 2016 7:37 PM | Updated on Sep 4 2017 10:52 AM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

ద్వారకాతిరుమల: భక్తులకు శ్రీవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.

ద్వారకాతిరుమల: భక్తులకు శ్రీవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదానం నిమిత్తం తణుకుకు చెందిన రెడ్డి సూర్యచంద్రరావు, నాగరత్నం దంపతులు గురువారం తాడేపల్లిగూడెంలోని మంత్రి మాణిక్యాలరావు నివాసం వద్ద రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు పాల్గొన్నారు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన పుసులూరి బుచ్చి ఫణిశర్మ, లక్ష్మి దంపతులు స్వామివారి నిత్యాన్నదాన భవనంలో అన్నదాన ట్రస్టుకు రూ.51,116ను విరాళంగా అందించారు. 
 

Advertisement

పోల్

Advertisement