ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది.
ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వెళ్తున్న మంత్రి రావెలకు వినతి పత్రం ఇచ్చేందుకు చీరాల టీడీపీ నేత పోతుల సునీత వర్గీయులు ప్రయత్నించారు. అయితే ఆయన తర్వాత చూద్దాం అంటూ దాటవేశాడు. దీంతో పోతుల వర్గీయులు మంత్రి కారును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రావెల అనుచరులు వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో పోతుల వర్గీయులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు.