ఘనంగా అండర్‌–18 వాలీబాల్‌ పోటీలు | under-18 valliball sports | Sakshi
Sakshi News home page

ఘనంగా అండర్‌–18 వాలీబాల్‌ పోటీలు

Aug 15 2016 12:11 AM | Updated on Sep 4 2017 9:17 AM

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ డివిజన్‌ స్థాయి అండర్‌–18 ఒకరోజు వాలీబాల్‌ పోటీలు ఆదివారం ఏపీఎస్పీ థర్డ్‌ బెటాలియన్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజన్‌కు చెం దిన వివిధ మండలాల నుంచి 14 వాలీ బాల్‌ టీములు పోటీల్లో పాల్గొన్నాయి.

కాకినాడ రూరల్‌ :
జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ డివిజన్‌ స్థాయి అండర్‌–18 ఒకరోజు వాలీబాల్‌ పోటీలు ఆదివారం ఏపీఎస్పీ థర్డ్‌ బెటాలియన్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజన్‌కు చెం దిన వివిధ మండలాల నుంచి 14 వాలీ బాల్‌ టీములు  పోటీల్లో పాల్గొన్నాయి. 150 మంది క్రీడాకారులు, 10 మంది రిఫరీలు పాల్గొనగా ఏపీఎస్పీ థర్డ్‌ బెటాలియన్‌ అడిషినల్‌ కమాండెంట్‌ మోహన్‌ప్రసాద్‌ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. క్రీడలు  శరీర దారుఢ్యా న్ని పెంచుతాయన్నారు. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అల్లూరి రామరాజు, అడిషినల్‌ కమాండెంట్‌ లోక్‌నాథ్‌ బాబు, ప్రధాన కార్యదర్శి వై.బంగార్రా జు, సంయుక్త కార్యదర్శి లంక జార్జి,  ధనరాజు, కె.యశ్వంత్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement