రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | Two killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Dec 26 2016 11:20 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన ఆర్‌ఎంపీ చక్రపాణి (50) సోమవారం పుట్లూరు మండలం ఎ.కొండాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొండాపురం దాటిన తర్వాత ముందు వెళుతున్న వాటర్‌ ట్యాంక్‌ ఆటోను వెనుకవైపు నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది.

జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన ఆర్‌ఎంపీ చక్రపాణి (50) సోమవారం పుట్లూరు మండలం ఎ.కొండాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొండాపురం దాటిన తర్వాత ముందు వెళుతున్న వాటర్‌ ట్యాంక్‌ ఆటోను వెనుకవైపు నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చక్రపాణిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. చక్రపాణికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు.

అడదాకులపల్లి ప్రమాదంలో యువకుడు...

రొద్దం మండలం చోలేమర్రికి చెందిన తిమ్మారెడ్డి, ప్రభావతమ్మ దంపతుల కుమారుడు గోవర్ధన్‌రెడ్డి సోమవారం వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంపై పెనుకొండకు బయల్దేరాడు. అడదాకులపల్లి అడ్డురోడ్డు సమీపాన మలుపువద్దకు రాగానే ఎదురుగా పెనుకొండ వైపు నుంచి మడకశిరకు వస్తున్న కేఏ02 ఏఎఫ్‌ 4156 నంబరుగల సిమెంట్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement