రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి | two killed in road accident in warangal district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

Aug 17 2016 8:18 AM | Updated on Aug 30 2018 4:07 PM

వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి.

వరంగల్ : వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు కథనం ప్రకారం.... బుధవారం తెల్లవారుజామున సీతారాంపురం నుంచి హైదరాబాద్కు గరిడె హరీశ్ (22) ఎలకొండ రజినీకాంత్ (24)  హైదరాబాద్కు బైక్పై బయలుదేరారు. ఆ క్రమంలో వారి బైక్ను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి.... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement