బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌ | Two killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌

Oct 1 2016 1:06 AM | Updated on Aug 25 2018 5:41 PM

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌ - Sakshi

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌

మనుబోలు : రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగింది.

  •  ఇద్దరు దుర్మరణం
  • మనుబోలు : రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగింది. మండలంలోని కొండూరుసత్రంకు చెందిన ఆవుల రామయ్య (50), కోట మండలం కొత్తపాళెంకు చెందిన పిగిలం రమేష్‌(25) కలిసి కొమ్మలపూడిలోని బంధువులను పరామర్శించేందుకు బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలోని కొత్త పవర్‌ గ్రిడ్‌ వద్ద వాకాడుకు చెందిన ఓ ట్రాక్టర్‌ రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి పడ్డ రామయ్య, రమేష్‌ తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు హైవేపై పడిపోవడంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గూడూరు ఎస్సై బాబీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పక్కకి తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement