బైక్‌ను ఢీకొన్న కారు--ఇద్దరి దుర్మరణం | Two killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు--ఇద్దరి దుర్మరణం

Jul 4 2016 9:31 AM | Updated on Aug 30 2018 4:07 PM

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం వద్ద బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం వద్ద బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కొర్రపాడు గ్రామానికి చెందిన వడ్డి పెద్దన్న(46), రాధాకృష్ణ(40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై సమీపంలోని తోటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో వాహనం అదుపుతప్పి ఇద్దకూ కిందపడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement