రెండు పూరిళ్లు దగ్ధం | two huts smashed ina fire accident | Sakshi
Sakshi News home page

రెండు పూరిళ్లు దగ్ధం

Aug 27 2016 11:13 PM | Updated on Sep 5 2018 9:47 PM

మామిడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రదాన విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన విద్యుత్‌ స్తంభం ఆకస్మికంగా శనివారం నేలకొరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్‌ స్తంభం దిగువ భాగం పాడవ్వడంతో స్తంభం నేలకొరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యు™Œ lస్తంభం పక్కనే ఉన్న వంపూరు రమేష్, రమణకు చెందిన పూరిళ్లకు మంటలు వ్యాపించాయి.

మామిడిపల్లి (సంతకవిటి) : మామిడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రదాన విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన విద్యుత్‌ స్తంభం ఆకస్మికంగా శనివారం నేలకొరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్‌ స్తంభం దిగువ భాగం పాడవ్వడంతో స్తంభం నేలకొరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యు™Œ lస్తంభం పక్కనే ఉన్న  వంపూరు రమేష్, రమణకు చెందిన పూరిళ్లకు మంటలు వ్యాపించాయి.
 
చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో రమేష్, రమణ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణహాని తప్పిందని, బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారని స్థానికులు తెలిపారు. ఇంట్లో దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలు ప్రమాదంలో కాలిపోయాయి. విద్యుత్‌ శాఖ ఏఈ టంకాల వెంకటశ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement