పెళ్లి వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి | two dies as marriage van turns turtle in visaka | Sakshi
Sakshi News home page

పెళ్లి వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి

Apr 30 2016 7:37 PM | Updated on Sep 3 2017 11:07 PM

విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎడ్డిప గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది.

రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎడ్డిప గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు కాగా వారిని 108 వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.

రావికమతం మండలం గన్నవారం గ్రామానికి చెందిన యువతికి రోలుగుంట మండలానికి చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వ్యానులో తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement