అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
Nov 24 2016 2:34 AM | Updated on Aug 25 2018 6:21 PM
కోదాడ: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన షేక్ సైదా, ఖమ్మం రూరల్ మండలం తెల్ధార్‌పల్లికి చెందిన వాడపట్ల సుదర్శన్‌రావులు బుధవారం యాక్టివ స్కూటర్‌పై వెళుతుండగా పోలీసులు కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేశారు. వారివద్ద రెండు బాక్సుల్లో 200 డిటోనేటర్ పిన్నులు, 189 జిలెటిన్ స్టిక్స్, 15 కట్టల బత్తి, 10 కేజీల అమ్మెనియం లభిం చాయి. వీటిని అనుమతి లేకుండా రవాణా చేస్తుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోదాడ కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement