ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు | TTD EO Met SVBC Officials | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు

Sep 24 2016 11:19 PM | Updated on Aug 25 2018 7:22 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రేక్షకులకు తన్మయత్వం కలిగేలా ఎస్వీబీసీ ప్రసారాలు మెరుగ్గా వుండాలని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని పరిపాలన భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమీక్షించారు.

– బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో ఈవో సమీక్ష
– ప్రసారాలు మెరుగ్గా ఉండాలని ఆదేశం
తిరుపతి అర్బన్‌:
 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రేక్షకులకు తన్మయత్వం కలిగేలా ఎస్వీబీసీ ప్రసారాలు మెరుగ్గా వుండాలని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని పరిపాలన భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమీక్షించారు. భక్తులు మరింత ఆకర్షితులయ్యేలా టీటీడీ చానల్‌ ప్రసారాలు వుండాలన్నారు.  అవసరమైన అధునాతన కెమెరాలు, లెసెన్స్‌లు, రోప్‌ కెమెరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీవారి వాహన సేవలపై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిపుణులతో వ్యాఖ్యానాలు చేయించాలన్నారు. కెమెరాల ద్వారా చిత్రీకకరణకు అనుగుణంగా మాఢవీధులు, గ్యాలరీల్లో మరింత లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.  టీటీడీకి చెందిన ట్రస్టులు, పథకాలు, ఇతర సేవా సంక్షేమ కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు.  తిరుమల, తిరుపతిలోని వివిధ వేదికలపై ఏర్పాటు చేస్తున్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించాలని కోరారు. అనంతరం ఈవో డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలసి సమీక్షించారు. ఈసమావేశంలో టీటీడీ ఎఫ్‌ఎఅండ్‌సీఏవో బాలాజీ, సీఏవో రవిప్రసాద్, అన్నదానం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement