నాగంను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత | trs followers tried attack on nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

నాగంను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత

Jul 2 2016 1:53 PM | Updated on Oct 19 2018 7:27 PM

నాగంను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత - Sakshi

నాగంను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నాగంకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన‌ట్లు స‌మాచారం.

దీంతో నాగం అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం తోపులాటకు దిగడంతో పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘర్షణతో ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement