నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య | triple it Student commits suicide in nuzvid | Sakshi
Sakshi News home page

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Jan 6 2017 3:58 AM | Updated on Nov 9 2018 4:36 PM

నూజివీడు  ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇం జినీరింగ్‌ ప్రథమ సంవత్సరం సివిల్‌ బ్రాంచి విద్యార్థిని అన్నారపు వీణ(18) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కుంది.

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇం జినీరింగ్‌ ప్రథమ సంవత్సరం సివిల్‌ బ్రాంచి విద్యార్థిని అన్నారపు వీణ(18) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన వీణ గురువారం ఉదయం తలనొప్పిగా ఉంద ని, తరగతులకు హాజరుకాలేనని స్నేహి తురాలు సంధ్యకి చెప్పిన హాస్టల్‌కి వెళ్లి పోయింది. తరగతుల అనంతరం వీణ రూంకి వెళ్లిన సంధ్యకు... వీణ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సెక్యూరిటీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వీణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement