ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం | tractor rolls and driver dies | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం

Jul 26 2017 10:45 PM | Updated on Sep 29 2018 5:26 PM

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం - Sakshi

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం

ట్రాక్టర్‌ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి.

ఉరవకొండ రూరల్‌: ట్రాక్టర్‌ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన బోయ తిప్పయ్య (21)కు మూడు నెలల కిందట బొమ్మనహాళ్‌ మండలం గోవిందవాడకు చెందిన యువతితో వివాహమైంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం ఉదయాన్నే ఇసుక కోసం కోసం రాయంపల్లి వైపు బయల్దేరాడు. మార్గం మధ్యలో అదుపుతప్పి ట్రాక్టర్‌ పక్కనున్న గుంతలోకి బోల్తాపడింది. డ్రైవింగ్‌ చేస్తున్న తిప్పయ్యకు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జీవితాంతం తోడుంటానని చెప్పి ఇలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోతివా.. ఇక నేనెట్లా బతకాలి దేవుడా.. అంటూ భార్య విలపించడం చూపరులను కలచివేసింది. ఎస్‌ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement