రేపు ప్రత్తిపాడులో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు | tomorrow teachers seminar | Sakshi
Sakshi News home page

రేపు ప్రత్తిపాడులో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు

Sep 19 2016 8:52 PM | Updated on Sep 4 2017 2:08 PM

ప్రత్తిపాడులోని ఆర్‌సీఎం పాఠశాల ఆవరణలో ఈనెల 21వ తేదీ బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంపై ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రత్తిపాడు :
ప్రత్తిపాడులోని ఆర్‌సీఎం పాఠశాల ఆవరణలో ఈనెల 21వ తేదీ బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంపై ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గోరస దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన జరిగే ఈ సభలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజగోపాల్, జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రాజు, ఉపాధ్యక్షుడు జె.మోహన్‌రావు, కార్యదర్శి బి.రామయ్య చౌదరి, ప్రత్తిపాడు తాలూకా జేఏసీ అధ్యక్షుడు రామిశెట్టి రాంబాబు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులంతా హాజరుకావల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement