ఏబీవీపీ బంద్‌ విజయవంతం | to success abvp bandh | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ బంద్‌ విజయవంతం

Jul 27 2016 12:46 AM | Updated on Sep 4 2017 6:24 AM

పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ మంగళవారం సంపూర్ణంగా జరిగింది.

సూర్యాపేట : పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ మంగళవారం సంపూర్ణంగా జరిగింది. ఆయా విద్యాసంస్థలు ముందే మూసివేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోచం శివ మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధిక ఫీజులు నియంత్రించాలని, పెంచిన ఇంజనీరింగ్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, దుర్గ, ప్రసన్న, నరేష్, శివ, రాహుల్, భార్గవ్, సన్ని, తరుణ్, దుర్గా, వినయ్, వెంకట్, సూర్యకాంత్, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement