ఏబీవీపీ బంద్ విజయవంతం
సూర్యాపేట : పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ మంగళవారం సంపూర్ణంగా జరిగింది. ఆయా విద్యాసంస్థలు ముందే మూసివేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోచం శివ మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధిక ఫీజులు నియంత్రించాలని, పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, దుర్గ, ప్రసన్న, నరేష్, శివ, రాహుల్, భార్గవ్, సన్ని, తరుణ్, దుర్గా, వినయ్, వెంకట్, సూర్యకాంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.