జైళ్లలో భద్రత పటిష్టం చేయాలి | To strengthen the security of prisons | Sakshi
Sakshi News home page

జైళ్లలో భద్రత పటిష్టం చేయాలి

Sep 18 2016 12:38 AM | Updated on Sep 15 2018 8:43 PM

జైళ్లలో భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జైళ్ళ శాఖ డీఐజీ కేశవ నాయుడు అన్నారు. వరంగల్‌లోని కేంద్ర కారాగారంలో వరంగల్‌ రేంజ్‌ లెవల్‌ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్‌ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేశవనాయుడు మాట్లాడుతూ జైళ్లలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని, ఈ మేరకు సూపరింటెండెంట్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పోచమ్మమైదాన్‌ : జైళ్లలో భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జైళ్ళ శాఖ డీఐజీ కేశవ నాయుడు అన్నారు. వరంగల్‌లోని కేంద్ర కారాగారంలో వరంగల్‌ రేంజ్‌ లెవల్‌ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్‌ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేశవనాయుడు మాట్లాడుతూ జైళ్లలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని, ఈ మేరకు సూపరింటెండెంట్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
 
అలాగే కారాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. జైళ్లలో చేపడుతున్న నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అదేశించారు. అనంతరం జైళ్లలో చేపడుతు న్న పలుఅంశాలపై చర్చించారు. సమావేశంలో ఐదు జిల్లాలజైలు అధికారులు న్యూ టన్‌ , భాస్కర్, మల్లారెడ్డి,రామచంద్రం, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, రంగరావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement