పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి | Three died in the river Penna | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురి మృతి

Jul 31 2016 6:01 PM | Updated on Oct 1 2018 2:11 PM

సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు.

 సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సరదాగా ఐదుగురు స్నేహితులు పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఐదుగురు నీటిలోకి దిగిన అనంతరం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ దశలో వీరి అరుపులు విన్న సమీప పొలాల్లోని రైతులు ఇద్దరు యువకులను కాపాడగలిగారు. ముగ్గురు మాత్రం నీటిలో మునిగిచనిపోయారు. మృతులు కడప నగరానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతిచెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement