విశాఖలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు.
	అక్కిరెడ్డిపల్లి(విశాఖపట్నం): విశాఖలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. దేవాలయ గుమాస్తాపై దాడి చేసి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అక్కిరెడ్డిపల్లిలోని బీహెచ్‌పీవీ సమీపంలోని  ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
	
	ఆలయంలోకి ప్రవేశించిన ఆగంతకులు గుమస్తా కాల్లు చేతులు కట్టేసి, ఆయన తలపై గాయపరిచి దేవాలయ హుండీలోని కానుకలు తీసుకెళ్లారు. గుమస్తాకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
