బాలిక కిడ్నాప్‌ కేసు చేధింపు | The kidnapping of the girl was a case | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌ కేసు చేధింపు

Jun 5 2017 10:53 PM | Updated on Sep 5 2017 12:53 PM

బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు సోమవారం చేధించారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బాలికను గత నెల 28న అదే గ్రామానికి చెందిన భూమిపోగుల మారుతీప్రసాద్, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్‌ చేసినట్లు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెద్దవడుగూరు: బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు సోమవారం చేధించారు.  మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బాలికను గత నెల 28న అదే గ్రామానికి చెందిన భూమిపోగుల మారుతీప్రసాద్, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్‌ చేసినట్లు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప‍ర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement