ఓసీ పేదలకు న్యాయం కోసం పోరాటం | The fight for justice for the poor ocs | Sakshi
Sakshi News home page

ఓసీ పేదలకు న్యాయం కోసం పోరాటం

Sep 27 2016 12:36 AM | Updated on Sep 4 2017 3:05 PM

అగ్రకులాల పేదలకు న్యాయం జరిగేంతవరకూ ఉద్యమిస్తామని అగ్రకుల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లా భాస్కర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంఎఆర్‌ గార్డెన్లో సోమవారం నిర్వహించిన ఓసీ మహా గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం పదేళ్లు ఉండాల్సిన రిజర్వేషన్లు రాజ కీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసం 70 ఏళ్ల వరకు పొడిగిస్తూ వచ్చాయన్నారు.

అగ్రకుల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి 

పరకాల : అగ్రకులాల పేదలకు న్యాయం జరి గేంతవరకూ ఉద్యమిస్తామని అగ్రకుల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లా భాస్కర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంఎఆర్‌ గార్డెన్లో సోమవారం నిర్వహించిన ఓసీ మహా గర్జన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం పదేళ్లు ఉండాల్సిన రిజర్వేషన్లు రాజ కీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసం 70 ఏళ్ల వరకు పొడిగిస్తూ వచ్చాయన్నారు. దీంతో ఓసీల్లోని పేదలకు అన్యాయం జరుగుతోందని, ఓసీ విద్యార్ధులు 90 శాతం మార్కులు సాధించినా సరైన అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల కారణంగా లబ్ధి పొందిన వారే మళ్లీ ప్రయోజనం పొందుతున్నారని, అందుకే ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ ఉద్యమాన్ని ప్రారంభించారని, అందులో న్యాయం ఉన్నందునే తాము మద్దతు ఇస్తున్నామని వివరించారు. సభలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, రెడ్డి సం ఘాల జిల్లా అధ్యక్షులు జయపాల్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల ఓసీ జేఏసీ కార్యక్రమాల కన్వీనర్‌ పురుషోత్తంరావు, జిల్లా కో కన్వీనర్‌ కామిడి సతీష్‌రెడ్డి, మండల కన్వీనర్‌ బూచి ప్రభాకర్‌రెడ్డి అశోక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, నందికొండ జయపాల్‌రెడ్డి, జడ్పీటీసీ కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, ఆర్‌పీ జయంత్‌లాల్, పీఏసీఎస్‌ చైర్మ¯ŒS దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement