జిల్లాలో ఐదుకోట్ల మెుక్కలు లక్ష్యం | The district aims to tree of five crores | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐదుకోట్ల మెుక్కలు లక్ష్యం

Aug 3 2016 10:09 PM | Updated on Sep 4 2017 7:40 AM

జిల్లాలో ఐదుకోట్ల మెుక్కలు లక్ష్యం

జిల్లాలో ఐదుకోట్ల మెుక్కలు లక్ష్యం

జిల్లాలో హరితహారం కార్యక్రమంలో ఐదు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర వాకాటి కరుణ తెలిపారు.

  •  కలెక్టర్‌ వాకాటి కరుణ వెల్లడి
  • స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌ : జిల్లాలో హరితహారం కార్యక్రమంలో ఐదు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర వాకాటి కరుణ తెలిపారు.
    మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్‌ వద్ద బుధవారం జరిగిన హరితహారంలో ఆమె మెుక్కలు నాటారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెట్ట పెంపకంతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అనంతరం కోమటిగూడెంలో శరత్‌ ఐ ఆసుపత్రి ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ సంపత్‌రావు, తహసీల్దార్‌ సదానందం, డాక్టర్లు శరత్, రామ్మోహన్, డానియేల్, గ్రామసర్పంచ్‌ రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు లత పాల్గొన్నారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement