కుంటలో పడి బాలుడి మృతి | The boy was dead in the water pond | Sakshi
Sakshi News home page

కుంటలో పడి బాలుడి మృతి

Nov 18 2016 6:01 PM | Updated on Jul 12 2019 3:02 PM

మరిపెడ మండలం దీస్యాతండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది

మరిపెడ(వరంగల్ జిల్లా): మరిపెడ మండలం దీస్యాతండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలగురు బాలబాలికలు సరదాగా ఈతకొడదామని దగ్గరలో ఉన్న కునాయ్‌కుంట వద్దకు వెళ్లారు. నలుగురిలో నగేష్(9) అనే బాలుడు ప్రమాదవశాత్తూ కుంటలో పడి మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు.

పక్కనున్న ముగ్గురు భయపడి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement