వాగులో పడి బాలిక గల్లంతు | Teenager drowns in pond | Sakshi
Sakshi News home page

వాగులో పడి బాలిక గల్లంతు

Oct 15 2016 5:09 PM | Updated on Apr 7 2019 4:36 PM

వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

ఖానాపూర్ (ఆదిలాబాద్) : వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. ఇది గుర్తించిన ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు బాలికలను రక్షించగా.. మరో బాలిక గల్లంతైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్‌మాటు వాగు వద్ద శనివారం చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఓ ముస్లిం కుటుంబం సదర్‌మాటు వాగును సందర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని రక్షించగా.. మరో బాలిక(15) నీట మునిగి గల్లంతైంది. గల్లంతైన బాలిక కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement