కృష్ణా పుష్కరాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు | talent hunt | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు

Aug 8 2016 11:28 PM | Updated on Sep 4 2017 8:25 AM

కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై రోజుకో అంశంపై పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సంయుక్త కలెక్టర్‌–2 పి.రజనీకాంతారావు తెలిపారు. ఆయన సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై రోజుకో అంశంపై పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సంయుక్త కలెక్టర్‌–2 పి.రజనీకాంతారావు తెలిపారు. ఆయన సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జల సంరక్షణ, నదుల అనుసంధానంపై ఇరిగేషన్‌ అధికారులు, అమరావతి అంశాన్ని జిల్లా పరిషత్‌ సీఈఓ నగేస్, మనం–వనం అంశాన్ని అటవీ శాఖ, విద్య, నైపుణ్యం అంశాన్ని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఫిజికల్‌ లిటరసీ అంశాన్ని డీఎస్‌డీఓ ఆహార అలవాట్ల అంశాన్ని ఐసీడీఎస్, స్వచ్ఛభారత్‌ అంశాన్ని విద్యాశాఖాధికారి, రెండంకెల అభివృద్ధి అంశాన్ని ముఖ్యకార్యనిర్వహణాధికారి, సాంకేతికత అంశాన్ని డీఐఓ, పేదరికంపై గెలుపు అంశాన్ని డీఆర్‌డీఏ, ఉపాధి అంశాన్ని సెట్‌శ్రీ సీఈఓలు పర్యవేక్షించాలని తెలిపారు. అంశాలను ప్రతిరోజు ఫొటోలతో సహా నోడల్‌ అధికారి అయిన జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయాలని సూచించారు. అనంతరం ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు. పశువుల డాటాను కూడా ఇందులో పొందుపరచాలని చెప్పారు. సమావేశానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఆర్‌. కూర్మనాథ్, జిల్లా అధికారులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement