తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి | Suspicious death of mother and daughter | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి

May 29 2016 2:57 PM | Updated on Sep 4 2017 1:12 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో కూతురితో సహా ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

చేగుంట (మెదక్) : కుటుంబ కలహాల నేపథ్యంలో కూతురితో సహా ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లయ్యకు ఐదేళ్ల క్రితం ఎల్లమ్మ(25)తో వివాహమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరిద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లమ్మ తన మూడేళ్ల కూతురు శృతితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

మధ్యాహ్నం సమయంలో తల్లీ కూతుళ్లు కాలి బూడిదైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు ఎల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement