‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’
ఆత్మహత్య చేసుకునేటంత పిరికి మనస్తత్వం తమ కుమార్తెకు లేదని, ఆమె ధైర్యవంతురాలని గురువారం కాకినాడ నారాయణ కళాశాల హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని గెడ్డం భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు తెలిపారు. కళాశాల నుంచి వచ్చిన ..
► భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు
► కుటుంబంలో తీవ్ర విషాదం
గొంది (సఖినేటిపల్లి):
ఆత్మహత్య చేసుకునేటంత పిరికి మనస్తత్వం తమ కుమార్తెకు లేదని, ఆమె ధైర్యవంతురాలని గురువారం కాకినాడ నారాయణ కళాశాల హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని గెడ్డం భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు తెలిపారు. కళాశాల నుంచి వచ్చిన సమాచారంతో తామంతా ఖంగుతిన్నామని ఆయన అన్నారు. భారతి ఆత్మహత్యపై కళాశాల నుంచి సరైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. భారతి మృతిని తాము జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. ఈ సంఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన సత్తిబాబు, రత్నకుమారి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె వనిత. చిన్న కుమార్తె భారతి, ఒక కుమారుడు. రత్నకుమారి ఉపాధిరీత్యా కువైట్‌లో ఉంటోంది.
ఇంటి వద్ద మృతురాలి నానమ్మ గెడ్డం వజ్రం, తండ్రి సత్తిబాబు ఉంటున్నారు. మృతురాలు భారతి, ఆమె సోదరుడు రాజోలు మండలం చింతలపల్లిలో పెద్దమ్మ (తల్లి సోదరి) కె. సుగుణకుమారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. ఇటీవల గొందిలో సోదరి వనిత పెళ్లి సందర్భంగా వారందరూ కలుసుకున్నారు. అప్పుడు కుటుంబ సభ్యులతో భారతి ఎంతో సంతోషంగా గడిపింది. వనిత వివాహం అనంతరం తల్లి రత్న కుమారి తిరిగి విదేశాలకు వెళ్లింది. భారతి మరణించిన సమాచారాన్ని విదేశాల్లో ఉన్న ఆమె తల్లికి పంపించారు.