సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు సొసైటీ చైర్మన్ పెండేకంటి కిరణ్‌కుమార్ చెప్పారు.
సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపుసం
Mar 27 2017 11:53 PM | Updated on Sep 5 2017 7:14 AM
సంజామల: సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు సొసైటీ చైర్మన్ పెండేకంటి కిరణ్‌కుమార్ చెప్పారు. స్థానిక సొసైటీలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు, సిబ్బంది సహకారంతో సొసైటీ అభివృద్ది బాటలో నడుస్తోందన్నారు. సొసైటీకి ఆప్కాబ్ కంప్యూటరీకరణ సౌకర్యం పైలట్ ప్రాజెక్టుకింద ఎంపికయినట్లు తెలిపారు. వర్గవైసమ్యాలు, రాజకీయాలకతీతంగా సంఘంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సంజామల గతంలో జిల్లాస్థాయిలో గుర్తింపు ఉండేదని ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల సిబ్బందికి పాలకవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చల్లా తిరుపాలయ్య, ఓబులమ్మ, బండి జనార్దన్‌రెడ్డి, సొసైటీ సీఈఓ రవీంద్రనా«ద్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
Advertisement


