కబడ్డీ విజేతగా ఎస్‌ఎస్‌బీఎన్‌ | ssbn team won in kabaddi | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేతగా ఎస్‌ఎస్‌బీఎన్‌

Sep 22 2017 10:50 PM | Updated on Jun 1 2018 8:45 PM

కబడ్డీ విజేతగా ఎస్‌ఎస్‌బీఎన్‌ - Sakshi

కబడ్డీ విజేతగా ఎస్‌ఎస్‌బీఎన్‌

ఎస్కేయూ అంతర్‌ కళాశాలల మహిళా క్రీడా పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు తన హవాను కొనసాగించింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఎస్కేయూ అంతర్‌ కళాశాలల మహిళా క్రీడా పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు తన హవాను కొనసాగించింది. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ క్రీడా పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు విజేతగా నిలిచి సత్తాను చాటింది. కబడ్డీలో విజయం సాధించడంతో పదోసారి విజేతగాను, బాస్కెట్‌బాల్‌లో తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. దీంతో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు ఈ టోర్నీలో ఆల్‌రౌండ్‌ విజేతగా నిలిచే అవకాశం ఉంది. కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు ఆర్ట్స్‌ కళాశాల జట్టు పై 44–18 స్కోరుతో విజయం సాధించింది.

బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు ఆతిథ్య ఆర్ట్స్‌ కళాశాల జట్టుపై 39–0తో విజయం సాధించి సత్తా చాటింది. వీటితో పాటు వాలీబాల్, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఫైనల్స్‌కు చేరింది. త్రోబాల్‌ పోటీల్లోనూ సెమీస్‌కు చేరుకుంది. ఖోఖో పోటీల్లో ఎస్‌కేపీ గుంతకల్లు జట్టు ఆర్ట్స్‌ కళాశాల జట్టుపై గెలిచి విజేతగా నిలిచింది. ఈ క్రీడా పోటీలు శనివారం ముగియనున్నాయని ఆర్ట్స్‌ కళాశాల పీడీలు శ్రీనివాసులు, జబీవుల్లాలు తెలిపారు. ఈ క్రీడా పోటీలను ఎస్‌కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరి జెస్సీ, పీడీలు వెంకటేష్‌నాయక్, చంద్రమోహన్, ప్రసాద్‌ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement