50 శాతం రాయితీతో స్ప్రింక్లర్ల పంపిణీ | sprinkers distributes of 50 percent discount | Sakshi
Sakshi News home page

50 శాతం రాయితీతో స్ప్రింక్లర్ల పంపిణీ

Jan 17 2017 11:23 PM | Updated on Sep 5 2017 1:26 AM

తుంపర సేద్యానికి అవసరమైన స్ప్రింక్లర్లను 50 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) ప్రాజెక్టు అధికారి సూర్యప్రకాశ్‌ మంగళవారం తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : తుంపర సేద్యానికి అవసరమైన స్ప్రింక్లర్లను 50 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) ప్రాజెక్టు అధికారి సూర్యప్రకాశ్‌ మంగళవారం తెలిపారు. ఈ నెలాఖరులోగా 5వేల హెక్టార్లకు సరిపడా స్ప్రింక్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకోసం ఎంపిక చేసిన మండలాలు, గ్రామాల్లో ఈ వారంలో స్ప్రింక్లర్‌ మేళా నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.

హెక్టారుకు సరిపడా స్ప్రింక్లర్‌ సెట్‌ ఖరీదు రూ.18 వేలు కాగా, అందులో రైతులు తమ వాటాగా రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. యూనిట్‌ కింద 25 పైపులు, ఐదు చిరకలు(గన్స్‌) అందజేస్తామన్నారు. హెచ్‌ఎల్‌సీ, హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల రైతులకు ఇవి ఎంతో ఉపయోగమన్నారు. ఆసక్తి గల రైతులు ఎంఐఏఓలు, ఏపీఎంఐపీ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement