‘కులానికో కార్పొరేషన్ కరెక్టు కాదు’ | singam sadasiva reddy statement on caste corporations | Sakshi
Sakshi News home page

‘కులానికో కార్పొరేషన్ కరెక్టు కాదు’

Nov 3 2016 10:23 PM | Updated on Sep 4 2017 7:05 PM

కాపుల అభివృద్ధికి కృషి చేయాలంటే వారికి ఈబీసీ కింద రిజర్వేషన్లను కల్పిస్తే సరిపోతుందని, అలా కాకుండా సీఎం చంద్రబాబు వారిని బీసీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించడం సరికాదని ఓసీ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.

అనంతపురం న్యూటౌన్‌ : కాపుల అభివృద్ధికి కృషి చేయాలంటే వారికి ఈబీసీ కింద రిజర్వేషన్లను కల్పిస్తే సరిపోతుందని, అలా కాకుండా సీఎం చంద్రబాబు వారిని బీసీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించడం సరికాదని ఓసీ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.

ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామనడం, ప్రత్యేక నిధులు కేటాయిస్తామనడం సబబుగా లేదన్నారు. దీనికంటే జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల్లోని పేదవారికి ఓసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement