ఎంపీపీ ఇంట్లో చోరీ | robery in mpp house | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఇంట్లో చోరీ

Aug 9 2016 2:12 AM | Updated on Sep 4 2017 8:25 AM

పట్టపగలే ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణం కేకేనగర్‌లో ఎంపీపీ లక్ష్మి కుటుంబంతో కలిసి సొంతింట్లో నివాసముంటున్నారు.

  •  12తులాల బంగారు నగలు, రూ.1.1లక్షల అపహరణ
  • జడ్చర్ల : పట్టపగలే ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణం కేకేనగర్‌లో ఎంపీపీ లక్ష్మి కుటుంబంతో కలిసి సొంతింట్లో నివాసముంటున్నారు. సోమవారం ఉదయం బాదేపల్లిలోని దయానంద విద్యామందిర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె తాళం వేసి వెళ్లారు.
     
    అంతకుముందే భర్త శంకర్‌నాయక్‌ పనిమీద బయటకు, పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన దుండగులు మధ్యాహ్నం తలుపులను బలంగా వెనక్కి నెట్టడంతో తెరుచుకున్నాయి. లోపలికి చొరబడి బీరువాలోని 12తులాల బంగారు నగలు, రూ.1.1లక్షలను అపహరించుకెళ్లారు. సాయంత్రం తిరిగొచ్చిన ఎంపీపీ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ గంగాధర్‌ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement