ఉంగుటూరు: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చొరబడ్డారు. బంగారం, వెండి వస్తువులతో పాటు నగదు చోరీ చేశారు.
అదును చూసి దోచేశారు
Aug 19 2016 1:39 AM | Updated on Sep 4 2017 9:50 AM
ఉంగుటూరు: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చొరబడ్డారు. బంగారం, వెండి వస్తువులతో పాటు నగదు చోరీ చేశారు. ఉంగుటూరు రావులపర్రు రోడ్డులోని ఓ ఇంట్లో చోరీ సంఘటనపై బాధితులు రెడ్డి సత్తమ్మ, పద్మావతి గురువారం రాత్రి చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుభకార్యం నిమిత్తం అత్తాకోడలైన రెడ్డి సత్తమ్మ, పద్మావతి ఈనెల 10న విశాఖ వెళ్లారు. గురువారం వీరి ఇంటికి వచ్చిన బంధువులు తలుపులు తెరిచి ఉండటం గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖలో ఉన్న సత్తమ్మ, పద్మావతి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోని బీరువా తెరిచి చూడగా ఐదు కాసుల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి, రూ.13 వేల నగదు అపహరించినట్టు గుర్తించి లబోదిబోమన్నారు. ఏలూరు క్లూస్ టీమ్ సీఐ కె.నరసింహమూర్తి వేలిముద్రలు సేకరిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చేబ్రోలు ఎస్సై చావా సురేష్ తెలిపారు.
Advertisement
Advertisement