విజయవాడ నగరంలో 27 మంది అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
27 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Aug 22 2016 12:27 PM | Updated on Aug 30 2018 5:24 PM
విజయవాడ: విజయవాడ నగరంలో 27 మంది అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల నుంచి దొంగలు ఈ సొత్తును కాజేశారు. పట్టుబడిన దొంగల్లో ఒడిస్సాకు చెందిన14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు, యూపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 16 మంది మహిళలు ఉండటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


