రాగల నాలుగు రోజుల్లో ఓ మాదిరి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో ఓ మాదిరి వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో 5 నుంచి 22 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చునన్నారు.
పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35, రాత్రిళ్లు 18 నుంచి 21 డిగ్రీలు , గాలిలో తేమ ఉదయం 53 నుంచి 80, మధ్యాహ్న సమయంలో 46 నుంచి 74 శాతం మధ్య ఉండవచ్చునన్నారు. వర్ష సూచనలు ఉన్నందున నాలుగు రోజుల పాటు వేరుశనగ పంట తొలగింపు, కొర్ర, సజ్జ లాంటి పంట కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తొలగించిన పంటను ఎండబెట్టుకుని వెంటనే వాములు వేసుకుని అవకాశం ఉంటే టార్పాలిన్లతో కప్పిపెట్టుకోవాలన్నారు.