రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు | raghavedra swamy Aradhanotsavalu | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

Aug 21 2016 8:05 PM | Updated on Sep 4 2017 10:16 AM

జహీరాబాద్‌ హనుమాన్‌ మందిరంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ హనుమాన్‌ మందిరంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాఘవేంద్రస్వామి 345వ జయంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆరాధనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయిత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో భజనలు చేశారు.

రాఘవేంద్రస్వామి ఆరాధన, అభిషేకం, పూజ, మంగళహారతి జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, జహీరాబాద్‌ తాలూకా అధ్యక్షుడు సుభాష్‌ కుల్‌కర్ణి, సహా అధ్యక్షుడు గిరిష్‌ జోషి, నాయకులు శ్రీకాంత్‌, శ్రీనివాస్‌జోషి, డాక్టర్‌ సురేష్‌ కులకర్ణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement