మైనారిటీలకు నాణ్యమైన విద్య | Quality education for minorities | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు నాణ్యమైన విద్య

Jul 21 2016 10:57 PM | Updated on Jul 12 2019 3:37 PM

మైనారిటీలకు నాణ్యమైన విద్య - Sakshi

మైనారిటీలకు నాణ్యమైన విద్య

మైనార్టీలకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మహబూబాబాద్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలుర గురుకుల పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించారు.

మహబూబాబాద్‌ : మైనార్టీలకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మహబూబాబాద్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలుర గురుకుల పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 121 మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని, ఈ విద్యా సంవత్సరం 71 పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. భవన నిర్మాణాలు, ఇతర ఖర్చుల కోసం రూ. 20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తోందన్నారు.  రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలంలో 240 గురుకుల పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) ఏర్పాటు చేస్తే, వాటిలో 1.40 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 319 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి 1.60 లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించిందని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు బడ్జెట్‌ పెంచామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ కృష్ణయ్య, కౌన్సిలర్లు ఎడ్ల పద్మ, యాళ్ల పుష్పలత, ముస్లిం పెద్దలు ఎక్బాల్, మెడికల్‌ బాబు, ఇబ్రహీం, చాంద్, టీఆర్‌ఎస్‌ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పొనుగోటి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement