జిల్లాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు పుష్కరాల ఘాట్లకు మందులు సరఫరా చేశారు. జిల్లాలో ఉన్న 52పుష్కర ఘాట్లకు దాదాపు రూ.80లక్షల మందులను కొనుగోలుచేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్లలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 640మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంచారు.
పుష్కర ఔషధాలు సిద్ధం
Aug 11 2016 11:02 PM | Updated on Sep 4 2017 8:52 AM
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు పుష్కరాల ఘాట్లకు మందులు సరఫరా చేశారు. జిల్లాలో ఉన్న 52పుష్కర ఘాట్లకు దాదాపు రూ.80లక్షల మందులను కొనుగోలుచేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్లలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 640మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంచారు. ముఖ్యమైన ఘాట్లలో తాత్కాలిక 10పడకల ఆస్పత్రులను ఏర్పాటుచేశారు. పుష్కర విధుల కోసం ప్రభుత్వ వైద్యులతో పాటు ఆరోగ్య శ్రీ అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు పనిచేస్తున్నారు. పుష్కరాల కోసం 18రకాల మందులను భక్తుల కోసం ఉపయోగించనున్నారు.
Advertisement
Advertisement