మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు కన్నుమూత | pusapati ananda gajapati raju pass away | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు కన్నుమూత

Mar 26 2016 10:01 AM | Updated on Jul 11 2019 8:38 PM

మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు కన్నుమూత - Sakshi

మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు కన్నుమూత

మాజీ మంత్రి, మాజీ ఎంపీ పూసపాటి ఆనందగజపతిరాజు శనివారం కన్నుమూశారు.

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు శనివారం కన్నుమూశారు.  విశాఖపట్నం నగరంలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆనందగజపతిరాజు రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా ఆనందగజపతి రాజు ఉన్న సంగతి తెలిసిందే.

కోరుకొండ సైనిక్ స్కూలుతో పాటు పలు విద్యాసంస్థలకు మాన్సాస్ ట్రస్టు భూములను ఇచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్గజపతిరాజుకి ఆనందగజపతి రాజు స్వయానా సోదరుడు.ఉత్తరాంధ్రలోని అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం, రామతీర్థంతోపాటు పలు దేవాలయాలకు ఆనందగజపతిరాజు అనువంశక ధర్మకర్తగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement