ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే మృతి

 Indurti Ex Mla Chinna Mallaiah passes away - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇందుర్తి నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేశిని ప్రజబంధుగా మంచి పేరుతెచ్చుకున్నారు. 

సీఎం కేసీఆర్ సంతాపం
ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశినేని చిన్న మల్లయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి చిన్న మల్లయ్య క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం. దేశినేని కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top