కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి.
డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
Aug 28 2016 9:34 PM | Updated on Sep 4 2017 11:19 AM
– కల్వకుర్తిలో ఐదో రోజుకు చేరిన రిలేదీక్షలు
కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో నాయకులు నర్సింహ, రాంరెడ్డి, రవిగౌడ్, హన్మం™Œ గౌడ్, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు కూర్చున్నారు. వీరికి టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధనకు ఐక్యమత్యంతో చేస్తున్న పోరుకు సమాజంలోని అన్ని వర్గాల కుల సంఘాలు, ఇతరులు మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న, కష్ణ, టీడీపీ నాయకులు పాండుయాదవ్, బీజేపీ నాయకులు రాఘవేందర్, దుర్గాప్రసాద్, గంగాధర్, జగదీష్, కోఆప్షన్ ఖలీల్, బీఎస్పీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement


