అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌ | one person arrest | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

Oct 5 2016 12:12 AM | Updated on Aug 20 2018 4:27 PM

బంధువని నమ్మి వచ్చిన యువతిపై కన్నేసి అత్యాచారం చేసిన కేసులో మొదటి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రమేష్‌కుమార్‌ తెలిపారు. కాజీపేట పోలీసుస్టేషన్‌లో ఎస్సై భీమేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాజీపేట : బంధువని నమ్మి వచ్చిన యువతిపై కన్నేసి అత్యాచారం చేసిన కేసులో మొదటి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రమేష్‌కుమార్‌ తెలిపారు. కాజీపేట పోలీసుస్టేషన్‌లో ఎస్సై భీమేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా మల్యాల మండలం కాల్వశ్రీరాంపురానికి చెందిన పొన్నం అంజయ్య(30) వరుసకు మరదలైన యువతిని పెళ్లి సంబంధం చూస్తానని నమ్మించి హైదరాబాద్‌ నుంచి కాజీపేటకు ఈ నెల 1వ తేదీ రాత్రి తీసుకొచ్చాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాజీపేట చౌరస్తాలో టిఫిన్‌ చేసి మద్యం తాగిన అంజయ్య ప్లాన్‌ ప్రకారం టౌన్‌ రైల్వేస్టేషన్‌ వైపు తీసుకెళ్లి బెదిరించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వారిని పసిగట్టిన మరో ఇద్దరు యువకులు యువతిని బెదిరించి అత్యాచారం చేశారు. ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పారిపోతున్న అంజయ్యను రైల్వేజంక‌్షన్‌ సమీపంలో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపించారని వివరించారు. సమావేశంలో క్రైం ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement