ఓగా బీఈడీ కళాశాలలో మాక్‌ అసెంబ్లీ | mock Assembly | Sakshi
Sakshi News home page

ఓగా బీఈడీ కళాశాలలో మాక్‌ అసెంబ్లీ

Jul 21 2016 6:27 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఓగా బీఈడీ కళాశాలలో మాక్‌ అసెంబ్లీ - Sakshi

ఓగా బీఈడీ కళాశాలలో మాక్‌ అసెంబ్లీ

చట్టాలు, అమలు చేసే విధానంపై మండల పరిధిలోని విద్యారణ్యపురిలోని ఓగా బీఈడీ కళాశాలలో విద్యార్థుల చేత మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు.

పరిగి : చట్టాలు, అమలు చేసే విధానంపై మండల పరిధిలోని విద్యారణ్యపురిలోని ఓగా బీఈడీ కళాశాలలో విద్యార్థుల చేత మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులే స్పీకర్‌, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటు సవాళ్లు, సమస్యలు చర్చించారు. మన రాష్ట్రానికి ఏయే అవసరాలున్నాయనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మాక్‌ అసెంబ్లీ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు, ప్రజాప్రతినిధులు పోషించే పాత్రను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం మహబూబ్ అలి, బాల్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, బసవరాజ్‌, జహంగీర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement