breaking news
mock assembly
-
పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగంఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్‌ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు. -
అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు.నేడు(నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కార్యాలయ ప్రాంగణంలో ‘విద్యార్థులు అండర్-18 మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మాక్ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు.‘విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. చైల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నా. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. అదే విధంగా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముంది. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీని వల్ల యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు... 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్‌ను పాస్ చేయడం అభినందనీయం’ అని తెలిపారు. -
ఓయూలో సీఎంగా వ్యవహరించిన ఈటల రాజేందర్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓయూలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మాక్ అసెంబ్లీలో ఆయన సీఎం సీట్లో ఆసీనులై ఆదేశాలిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భవిష్యత్తు తెలంగాణ వేదిక’ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించగా.. ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సెషన్‌ను ప్రారంభించారు. గవర్నర్‌గా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర్‌రావు వ్యవహరించారు. చదవండి: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది ముఖ్యమంత్రి హోదాలో ఈటల మాట్లాడుతూ మన రాజ్యాంగం సామాన్యులకు సైతం కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. ఇటీవలి హుజూరాబాద్ ఎన్నికల్లో తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తనకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. మాక్ అసెంబ్లీ స్పీకర్లుగా ఎర్రబెల్లి రజినీకాంత్, సాయికృష్ణారావు, దేవికారెడ్డిని ఎన్నుకోగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, రాణిరుద్రమ దేవి పాల్గొన్నారు. చదవండి: యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం -
‘టీడీపీ మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారు’
సాక్షి, అమరావతి: టీడీపీ నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీని చూస్తుంటే సురభి డ్రామా కంపెనీ గుర్తొస్తుందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్వీఆర్, నాగభూషణం, సావిత్రి వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా ఉత్పత్తి కంపెనీలు చెప్పాలి. కానీ చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకు ఏమన్నా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లల్లో పాల్గొనేందుకు టీకా కంపెనీలు సిద్దంగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమిటని నిలదీశారు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ప్రజలకు సంక్షేమం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలిసారి జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్, మైనార్టీల బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలో జెండర్, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాం. కాపు నేస్తం పథకాన్ని చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేస్తున్నాం. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పిస్తున్నాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మేం తీరుస్తున్నాం. రూ. 31 వేల కోట్లతో ఆస్తుల కల్పనకు నిర్ణయించాం’ అని మంత్రి తెలిపారు. చదవండి: సీఎం జగన్ అప్యాయంగా పలకరించారు: మండలి చైర్మన్ -
ఓగా బీఈడీ కళాశాలలో మాక్ అసెంబ్లీ
పరిగి : చట్టాలు, అమలు చేసే విధానంపై మండల పరిధిలోని విద్యారణ్యపురిలోని ఓగా బీఈడీ కళాశాలలో విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులే స్పీకర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటు సవాళ్లు, సమస్యలు చర్చించారు. మన రాష్ట్రానికి ఏయే అవసరాలున్నాయనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు, ప్రజాప్రతినిధులు పోషించే పాత్రను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం మహబూబ్ అలి, బాల్‌రెడ్డి, వినోద్‌కుమార్, బసవరాజ్, జహంగీర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


