మొబైల్‌ కూరగాయల బజార్‌ ప్రారంభం | Mobile bajar inaguration | Sakshi
Sakshi News home page

మొబైల్‌ కూరగాయల బజార్‌ ప్రారంభం

Jul 21 2016 5:25 PM | Updated on Sep 4 2017 5:41 AM

మొబైల్‌ కూరగాయల బజార్‌ ప్రారంభం

మొబైల్‌ కూరగాయల బజార్‌ ప్రారంభం

జాతీయ ఆహార భద్రత మిషన్‌ పిలుపుతో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని బలిజిపేటలో గురువారం గ్రామ సర్పంచ్‌ వెలిది తాయారమ్మ ప్రారంభించారు.

బలిజిపేట రూరల్‌: జాతీయ ఆహార భద్రత మిషన్‌ పిలుపుతో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని బలిజిపేటలో గురువారం గ్రామ సర్పంచ్‌ వెలిది తాయారమ్మ ప్రారంభించారు. ప్రతి గురువారం బలిజిపేటలో తక్కువ ధరలకు నిర్వహించే మొబైల్‌ కూరగాయల బజారును సద్వినియోగం చేసుకోవాలని తాయారమ్మ కోరారు. టమాటాలను రూ.28, బెండకాయలు రూ.25, చిక్కుడు రూ.30, ఉల్లిపాయలు రూ.15, బంగాళదుంపలు రూ.23కు విక్రయించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్‌ వి.సుబ్బారావు, ఎం.పాపినాయుడు, ఎం.అప్పారావు, టి.ప్రసాదరావు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement