MLA Jogarao: ‘మార్గం’ చూపిన ఎమ్మెల్యే

Construction of Vantaram Road with Zilla Parishad funds MLA Jogarao - Sakshi

సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో వంతరాం నుంచి కొత్త వంతరాం వరకు రూ.20లక్షలతో రోడ్డు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొత్తవంతరాం గ్రామస్తులకు సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుండడంతో ఎమ్మెల్యే జోగారావుకు కొద్దికాలం క్రితం గ్రామస్తులు విన్నవించుకున్నారు.

వంతరాం నుంచి కొత్తవంతరాం వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇదే

దీనికి స్పందించిన ఎమ్మెల్యే జోగారావు జిల్లా పరిషత్‌ నిధులు రూ.20లక్షలు మంజూరుచేయించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు చేపట్టి నిర్మాణం పూర్తయితే తమ అవస్థలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు.   

చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top